సూర్యాపేట (జూన్ – 20) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ల సంఘం (711) జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ అధ్యాపకుల హక్కుల కోసం, విద్యార్థుల అభ్యున్నతి కోసం చేసిన కృషికి గాను బెస్ట్ లెక్చరర్ అవార్డు (Best lecturer award) ఇచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్ నగర్ నందు రాజనీతి శాస్త్రం అధ్యాపకుడిగా వినూత్న పద్ధతుల్లో విద్యా బోధనతో పాటు, కళాశాల అడ్మిషన్ల సంఖ్య విశేషంగా పెంచడానికి చేసిన విశేష కృషికి గాను బెస్ట్ లెక్చరర్ అవార్డును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా హేమచందర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్ క్రమబద్ధీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, సహకరించిన జిల్లా మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి, మంత్రివర్యులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డికి, అధికారులకు మరియు DIEO లకు ధన్యవాదాలు తెలియజేశారు.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER