Home > CURRENT AFFAIRS > AWARDS > BCCI NAMAN AWARDS – WINNERS LIST

BCCI NAMAN AWARDS – WINNERS LIST

BIKKI NEWS (JAN. 23) : BCCI NAMAN AWARDS – నమన్‌ అవార్డ్స్‌ పేరిట బీసీసీఐ హైదరాబాద్ వేదికగా అవార్డులను ప్రకటించింది. భారత మాజీ ఆల్‌రౌండర్‌, కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) కర్నల్‌ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా అతడికి అవార్డు బహూకరించారు. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. రిటైర్మెంట్‌ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్‌ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనతోపాటు ఫరూక్‌ ఇంజనీర్‌ కూడా ఈ అవార్డు అందుకున్నారు.

అంతేకాకుండా 2022 – 23కుగానూ పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ నిలవగా, జస్‌ప్రీత్‌ బుమ్రా (2021 – 22), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2020 – 21), మహ్మద్‌ షమీ (2019 – 20) గెలుచుకున్నారు. ఉత్తమ మహిళా క్రికెటర్‌గా 2020 – 21, 2021 – 22కిగానూ స్మృతి మందాన నిలిచింది. 2019 – 20, 2022 – 23 సంవత్సరాలకు దీప్తి శర్మ ఈ పురస్కారం అందుకుంది. వివిధ విభాగాల్లో పలువురు అవార్డులు గెలుచుకున్నారు.

★ బెస్ట్‌ అంపైర్‌ అవార్డు

  • పద్మనాభన్‌ (2019-20),
  • వ్రిందా (2020-21),
  • జయరామన్‌ మదన్‌ గోపాల్‌ (2021-22),
  • రోహన్‌ పండిట్‌ (2022-23)

★ వన్డేల్లో అత్యధిక వికెట్లు (ఉమెన్‌)

  • పూనమ్‌ యాదవ్‌ (2019-20),
  • జులన్‌ గోస్వామి (2020-21),
  • రాజేశ్వరి గైక్వాడ్‌ (2021-22),
  • దేవికా యాదవ్‌ (2022-23)

★ వన్డేల్లో అత్యధిక పరుగులు (ఉమెన్‌)

  • పూనమ్‌ రౌత్‌ (2019-20),
  • మిథాలీ రాజ్‌ (2020-21),
  • హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (2021-22),
  • రోడ్రిగ్స్‌ (2022-23)

★ దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు

టెస్టుల్లో అత్యధిక వికెట్లు: రవిచంద్రన్‌ అశ్విన్‌ (2022-23)

టెస్టుల్లో అత్యధిక పరుగులు: యశస్వి జైస్వాల్‌ (2022-23)

★ బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూట్‌ (ఉమెన్‌)

  • ప్రియా పునియా (2019-20),
  • షెఫాలీ వర్మ (2020- 21),
  • సబ్బినేని మేఘన (2021-22),
  • అమన్‌జోత్‌ కౌర్‌ (2022-23)

★ బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ డెబ్యూట్‌ (మెన్‌)

  • మయాంక్‌ అగర్వాల్‌ (2019 – 2020),
  • అక్షర్‌ పటేల్‌ (2020-21),
  • శ్రేయస్‌ అయ్యర్ (2021-22),
  • యశస్వి జైస్వాల్‌ ( 2022-23)

★ మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ)

అత్యధిక వికెట్లు:

  • జయదేవ్‌ ఉనద్కత్‌ (2019-20),
  • షామ్స్‌ ములానీ (2021-22),
  • సక్సేనా (2022-23)


అత్యధిక పరుగులు:

  • రాహుల్‌ దలాల్‌ (2019-20),
  • సర్ఫరాజ్‌ ఖాన్‌ (2021-22),
  • మయాంక్‌ అగర్వాల్‌ (2022-23)

★ లాలా అమర్నాథ్‌ అవార్డు

ఉత్తమ ఆల్‌ రౌండర్‌ (దేశవాళీ క్రికెట్‌) :

  • బాబా అపరాజిత్‌ ( 2019-20),
  • ఆర్‌ఆర్‌ ధావన్‌ ( 2020-21, 2021-22),
  • రియాన్‌ పరాగ్‌ ( 2022-23)

ఉత్తమ ఆల్‌ రౌండర్ (రంజీ ట్రోఫీ):

  • మురా సింగ్‌ (2019-20),
  • శామ్స్‌ ములానీ (2021-22),
  • శరాన్ష్‌ జైన్‌ (2022-23)

★ ఉత్తమ జట్టు (దేశవాళీ టోర్నమెంట్‌)

  • ముంబయి (2019-20),
  • మధ్యప్రదేశ్‌ (2021-22),
  • సౌరాష్ట్ర (2022-23)