BANK JOBS – బ్యాంకు ఆఫ్ బరోడా మేనేజర్ ఉద్యోగాలు

BIKKI NEWS (DEC – 13) : ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన 250 సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి (bank of Baroda jobs) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 26 లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 01.12.2023 నాటికి 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230.

ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా..

దరఖాస్తు గడువు : 26.12.2023

వెబ్సైట్ : https://www.bankofbaroda.in/career