Home > ESSAYS > BABU JAGJJIVANRAM జీవిత విశేషాలు – తలారి మునిస్వామి వ్యాసం

BABU JAGJJIVANRAM జీవిత విశేషాలు – తలారి మునిస్వామి వ్యాసం

● జగ్జీవన్ రామ్ బాల్యం ::

1908 ఏప్రిల్ 05 న బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా (ప్రస్తుతం జోద్పూర్) చందా అనే చిన్న మారుమూల గ్రామంలో శిబిరామ్, బసంతిదేవి దంపతులకు జన్మించిన సంతానం జగ్జీవన్ రామ్. ఇతనికి సంత్ లాల్ అనే అన్నయ్య తో పాటు ముగ్గురు సోదరీమణులు కూడా ఉన్నారు.. జగ్జీవన్ రామ్ తండ్రి శిబిరామ్ గారు కొంతకాలం బ్రిటిష్ సైన్యంలో పనిచేసి తర్వాత రాజీనామా చేసి రైతుగా స్థిరపడ్డాడు.. జగ్జీవన్రామ్ ఎదుగుతున్న సమయంలోనే తండ్రి మరణించారు వారి తల్లి అన్నీ తానై జగ్జీవన్ రామ్ కి అండగా నిలిచింది. ఇతడు చిన్నతనం నుండే గురువుల యందు భక్తి శ్రద్ధలు ధర్మ ప్రవర్తన కలిగి ఉండేవారు.

● విద్యాభ్యాసం ::

1914 సం,,లో జగ్జీవన్ రామ్ ఆరా పట్టణంలో తన పాఠశాల విద్యను ప్రారంభించారు.. ఆనాటి జాతి కుల వివక్షలు జగ్జీవన్ రామ్ ను మానసిక వేదనకు గురి చేశాయి
ఇతడు చదివే పాఠశాలలో దళితులు తాగే కుండలో నీటిని అగ్రకుల విద్యార్థులు తాగడానికి నిరాకరించడంతో ఆ పాఠశాల హెడ్ మాస్టర్ దళితులకు ఇతర కులాల విద్యార్థులకు వేరువేరుగా నీళ్లు తాగే కుండలను పెట్టించడం జరిగింది అప్పుడు జగ్జీవన్ రావ్ గారు పాఠశాలలోని మొత్తం కుండలను పగులగొట్టి నిరసన తెలిపిన ధైర్యశాలి.. అప్పటి నుండి పాఠశాలల్లోని విద్యార్థులకు అందరికీ ఒకే కుండను ఏర్పాటు చేశాడు ప్రధానోపాధ్యాయుడు.

జగ్జీవన్ రామ్ కష్టతరమైన గణిత శాస్త్రము మరియు సంస్కృతం లో నూటికి నూరు శాతం మార్కులతో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.

తర్వాత తన కళాశాల విద్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొనసాగించారు.1931లో కలకత్తా విశ్వవిద్యాలయంలో B.sc లో పట్టభద్రులైనారు.. చిన్న వయసులో ఎంతో కష్టపడి భోజ్ పూరి తో పాటు హిందీ ఇంగ్లీష్ బెంగాలీ సంస్కృతమ్ వంటి భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు… ఆ రోజుల్లో అనగారిన విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ నిరాకరించారు.. కేవలం ప్రతిభ ఆధారంగా ఇచ్చే స్కాలర్షిప్పులు మాత్రమే అంగీకరించారు.. జీవన్ అంటరానితనంరామ్ ఎంతో మేధావి అయినప్పటికీ తక్కువ కులంలో పుట్టినందుకు చిన్నతనం నుండి అనేక కష్టాలు అనుభవించాడు.

● ఉద్యమ ప్రేరేపణ ::

అంటరానితనాన్ని ఎండగట్టడానికి అంటరాని వాళ్లను ఏకం చేస్తూ ఉద్యమ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. 35 వేల మంది కార్మికులను ఏకం చేసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంలోనూ నేతాజీ మరియు చంద్రశేఖర్ ఆజాద్ ల దృష్టిలో పడ్డాడు.. 1934లో బీహార్ లో వచ్చిన భయంకర భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన ఎంతోమంది అభాగ్యులకు తన బృందంతో అహర్నిశలు శ్రమించి పునరావాస కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా నిలిచారు.. ఆహారం మంచినీరు మందులు లు ఆవాసాలు మొదలగునవి కల్పించారు ఈ సందర్భంలోనే మొదటిసారిగా ఆయన గాంధీజీని కలుసుకోవడం జరిగింది.. ఇతడు గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షితులై 1930 లోనే సత్యాగ్రహం పాల్గొని బ్రిటిష్ లాఠీ దెబ్బలకు బెదరకుండా పోలీసులను ఎదిరించి నిలిచిన ఘనుడు.. కాన్పూర్లో 1935లో జరిగిన డిప్రెషడ్ క్లాసెస్ లీగ్ కు అధ్యక్షత వహించాడు ఈ సంస్థకు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1942 వరకు అధ్యక్షుడిగా కొనసాగాడు.. అదే సంవత్సరం జూన్ ఒకటో తేదీన కాన్పూర్కు చెందిన సంఘసేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవి గారితో జగ్జీవన్ రామ్ గారికి వివాహం జరిగింది.. ఇంద్రాణి గారు గొప్ప స్వాతంత్ర సమరయోధులే గాక మంచి విద్యావేత్త . దేశం కోసం పోరాడే ఈ పుణ్యదంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు సురేష్, కుమార్తె మీరా.. కుమార్తె మీరా తండ్రి ఆదర్శాలతో తిరిగి కేంద్రమంత్రిగా లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు

● రాజకీయ ఆరంగేట్రం ::

జగ్జీవన్ రామ్ 27 ఏళ్ళ వయసులోనే శాసన సభ్యుడిగా ఎన్నికై శాసన మండలి లో అడుగుపెట్టాడు ఈ కారణంగా అతని బేబీ మినిస్టర్ గా పిలిచేవారు.. ఈ సందర్భంలోనే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం అందింది . 1942లో పార్టీ పిలుపు మేరకు జగ్జీవన్ రామ్ పార్టీలో కొనసాగాడు 1969లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1977లో ఇందిరా గాంధీ తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు.. అనంతరం 1980 లో లో కాంగ్రెస్ J ను స్థాపించి ఆంధ్ర ప్రదేశ్ కు దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.. దాదాపు యాభై సంవత్సరాలు పార్లమెంట్ ను ఏలిన మహా జ్ఞాన శీలి.. వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా , కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అందించిన సేవలు దేశ భవిష్యత్తు కు పీటలు వేశాయి.. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు దేశ అభివృద్ధికి ఎంతో మేలు చేశాయి.. ఇతడు రక్షణ మంత్రిగా శత్రు దేశాలకు తనదైన శైలి నిర్ణయాలతో భారతదేశ ఔనత్యాన్ని నింగిలో నిలిపాడు.. వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం తెచ్చిన రైతు ఆయన.. ఆహార మంత్రిగా గిడ్డంగులను నిర్మించిన గొప్ప నేత అయిన.. రైల్వే శాఖ మంత్రిగా బ్రిటిష్ రైల్వేలను ప్రక్షాళన చేసి భారతీయ ముద్ర సాధించిన భారతీయుడు.. ఒకవైపు తక్కువ కులం అంటరానితనం అనే వివక్ష ఎదుర్కొంటూనే జాతిని జాగృతం చేసిన సమాజసేవకులు జగ్జీవన్రామ్.. జీవించినంత కాలం తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహనీయుడు.. జీవన్దాన్ గొప్ప రాజకీయ వెత్తనే కాదు గొప్ప రచయిత కూడా. పైన హిందీలో ఇంగ్లీషులో అనేక రచనలు చేశారు.. భారతదేశంలో కుల సవాల్లు , జీవన సరళి వ్యక్తిత్వ వికాసం అనే రెండు గ్రంథాలు రాశారు.. ఆయన గొప్ప అధ్యయనశీలి.. విక్రమ విశ్వవిద్యాలయ 1969లో డాక్టర్ ఆఫ్ సైన్స్ అనే గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేసింది.. ఆయన మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాలయం 1968లో డాక్టరేటుతో సత్కరించింది.

దాదాపు యాభై సంవత్సరాలు పార్లమెంట్ ను ఏలిన మహా జ్ఞాన శీలి.. వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా , కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అందించిన సేవలు దేశ భవిష్యత్తు కు పీటలు వేశాయి..

● నిర్యాణం ::

చివరకు ఆయన 1986 జులై 6వ తేదీన తుది శ్వాస విడిచారు.. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసిన సేవలు సంఘ సంస్కరణలు ఆయన ఆచరించిన సిద్ధాంతాలు మన మధ్య సజీవంగానే ఉంటాయి. ఆయన జయంతిని సమత దివస్ గా జరుపుకుంటారు.

● బిరుదులు ::

అమూల్య రత్నం , బేబీ మినిస్టర్

వ్యాసకర్త ::

తలారి మునిస్వామి – అధ్యక్షులు
ఆర్జెడి అపాయింటెడ్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ 508
ఉమ్మడి పాలమూరు జిల్లా