BIKKI NEWS :
◆ చరిత్ర : ఇంగ్లండ్ జట్టు 1882లో ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది ఇంగ్లీష్ గడ్డపై ఆస్ట్రేలియన్‌లపై వారి మొదటి ఓటమి. ఈ ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్‌కు సంతాపం తెలుపుతూ బ్రిటిష్ వార్తాపత్రిక, ది స్పోర్టింగ్ టైమ్స్ ఒక వ్యంగ్య సంస్మరణను ప్రచురించింది. ఆ పేపర్ ప్రతులను కాల్చిన బూడిద (Ash) గుర్తుగా ఈ సిరీస్‌కు ‘ ది యాషెస్’ అనే పేరు వచ్చింది.
◆ ఆధిపత్యం ఎవరిది : ఆ తర్వాత, ఇరు జట్ల మధ్య 72 యాషెస్ సిరీస్‌లు జరగగా, ఆస్ట్రేలియా 34 విజయాలు సాధించగా, ఇంగ్లండ్ 32 సార్లు గెలిచింది. కేవలం ఆరు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
◆ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా :
ఇంగ్లండ్ చివరిసారిగా 2015లో యాషెస్‌ను గెలుచుకుంది. 2022లో ఆస్ట్రేలియా 4-0 తేడాతో తో గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.
1882 నుంచి యాషెస్ సిరీస్ జరుగుతుంది. 1882 నుంచి వరుసగా 6 యాషెస్ సిరీస్ లను ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది. 1891 – 92 లో తొలిసారి ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలుచుకుంది.
2022 లో ఆస్ట్రేలియా 4- 0 తేడాతో ఘనంగా సిరీస్ నెగ్గింది.
2019 లో 2- 2 తో యాషెస్ సిరీస్ సమం అయింది
2017 – 18 యాషెస్ సీరిస్ ను ఆస్ట్రేలియా 4- 0 తేడాతో ఘనంగా సిరీస్ నెగ్గింది.
2023 లో ఇంగ్లండ్ గడ్డపై 5 టెస్టుల యాషెస్ సమరం జూన్ 16 నుంచి ప్రారంభమైంది.
- HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 10 – 2024
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- NOBEL PEACE PRIZE 2024 -నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
- JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు