BIKKI NEWS (NOV. 22) : arrest warrent on banzamin netanyahu. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపైనా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (International Criminal Court) అరెస్టు వారెంట్ జారీ చేసింది.
arrest warrent on banzamin netanyahu
గాజాలో చేస్తున్న యుద్ధంలో యుద్ధనేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నెతన్యాహూ, గల్లెంట్‌పై, 2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడినందున హమాస్ అధికారులపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ఐసీసీ నిర్ణయాన్ని నెతన్యాహూ ఖండిస్తూ, అసంబద్ధమైన, అబద్ధపు ఆరోపణలను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. గాజాలో యుద్ధానికి మించి ఏమీ జరగలేదని ఆయన కార్యాలయం పేర్కొంది.