TIMED OUT : క్రికెట్ చరిత్రలో తొలిసారి

న్యూడిల్లి (నవంబర్ – 06) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ (ANGELO MATHEWS TIMED OUT) అయ్యాడు.

వికెట్ పడిన తర్వాత 2 నిమిషాలలో కొత్త బ్యాట్స్మెన్ క్రీజులో ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు నిమిషాల సమయంలో ఏంజిలో మాథ్యూస్ క్రీజులోకి రాకుండా హెల్మెట్ కోసం వెయిట్ చేయడంతో అంఫైర్ 40.1.1 నిబంధన ప్రకారం టైమ్డ్ ఔట్ గా ప్రకటించాడు.

40.1.1 వికెట్ పతనం లేదా బ్యాటర్ ఔటయ్యాక, ఇన్‌కమింగ్ బ్యాటర్ తప్పనిసరిగా, బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి లేదా ఇతర బ్యాటర్ 2 నిమిషాల్లో తదుపరి బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి. . ఈ విధంగా అందుబాటులో లేకపోతే, ఇన్‌కమింగ్ బ్యాటర్ అవుట్ అవుతాడు..