విజయవాడ (సెప్టెంబర్ – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. దాదాపు 10 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశానికి ఆమోదం తెలిపింది. అలాగే గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ (GPS PENSION SYSTEM IN AP) అమలకు ఆమోదం తెలిపింది.
వీటితోపాటు మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అవి..
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట అవార్డులు. ప్రిలిమ్స్ పాస్ అయితే రూ. లక్ష, మెయిన్ పాస్ అయితే రూ.50వేలు ప్రోత్సాహక అవార్డు ఇవ్వనున్నారు.
ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు- 2022కి ఆమోదం.
ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు సంబంధించిన అంశం పై కేబినెట్ ఆమోదం.
ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇంటి స్థలం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించేలా కేబినెట్ నిర్ణయం.
దివ్యాంగుల ఒలంపిక్స్ లో పతకం సాధించిన క్రీడాకారిణి షేక్ జఫ్రీన్ కు గ్రూప్-1 ఉద్యోగం.
కింగ్ జార్జ్ అసుపత్రి సహా ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు 353 పోస్టుల భర్తీకి నిర్ణయం.
వైద్యశాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు నిర్ణయం.
ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ అమోదం.
అంతర్జాతీయ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ సర్టిఫికేషన్ ఇచ్చేలా సవరణ.
కురుపాం ఇంజినీరింగ్ కళాశాలలో గిరిజనులకు 50 శాతం రిజ్వేషన్లకు కేబినెట్ ఆమోదం.
ఆధార్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
ఆర్డీఎఫ్, కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుపై మరో ఏడాది
ని షేధం.
ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్ఓ) బిల్లుకు కేబినెట్ ఆమోదం.
కాకినాడ బల్క్ డ్రగ్ పార్కు ను నక్కపల్లిలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
ఏపీ హైకోర్టు లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఆమోదం.
ఏపీ జీఎస్టీ చట్ట సవరణకు, దేవాదాయ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ భూములు చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.