NZvsAFG : న్యూజిలాండ్ ఘనవిజయం

చెన్నై (అక్టోబర్ – 18) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు చెన్నై వేదికగా న్యూజిలాండ్ – ఆప్ఘనిస్థాన్ (NZvsAFG) జట్లు మద్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 4 విజయం సాదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కివీస్ బౌలర్లలో పెర్గ్యుసన్ 3, శాంటర్న్ – 3, బౌల్ట్ – 2 వికెట్లు తీశారు. అప్ఘనిస్తాన్ బ్యాట్స్‌మన్ లలో రహమత్ షా – 36, ఓమర్జాయ్ – 27 పరుగులతో రాణించగా 139 పరుగులకే ఆలౌట్ అయింది.

అంతకు ముందు గ్రెన్ ఫిలిప్స్ (71) టామ్ లాథమ్ (68) పరుగులతో 5 వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి కివిస్ ను 288/6 పరుగులు సాదించి పెట్టారు..

అంతకుముందు టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుని న్యూజిలాండ్ జట్టు ను 110 పరుగులకే 4 వికెట్లు తీసి పూర్తి ఒత్తిడిలోకి నెట్టింది. అయితే లాథమ్, ఫిలిప్స్ జోడి కుదురుకుని చివరలో విరుచుకుపడ్డారు. దీంతో కివీస్ మంచి స్కోర్ సాదించింది. యంగ్ (54), రచిన్ రవీంద్ర (32), చాఫ్‌మాన్ (25) పరుగులతో రాణించారు. ఆప్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ – 2, ఓమర్జాయ్ – 2 వికెట్లు తీశారు.