ఇంటర్ విద్యకు ప్రభుత్వ కళాశాలలో చేరాలి

కొడిమ్యాల (మార్చి – 07) : కొడిమ్యాల మండలంలో పదవ తరగతి పాసైన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని (Admission into gjc kodimial says kolakani manohar) విద్యార్థులను కొడిమ్యాల సామాజిక కార్యకర్త కొలకాని మనోహర్ కోరారు. గురువారం కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉద్దేశించి సామాజిక కార్యకర్త కొలకాని మనోహర్ ముదిరాజ్ మాట్లాడుతూ పదవ తరగతి అనంతరం ఇంటర్ విద్య కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం కలిపిస్తున్న ఉచిత ప్రవేశం, ఉచిత పుస్తకాలు, ఉపకార వేతనాలు వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన ఉండటం వలన మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల అధ్యాపకులు డా. పి. తిరుపతి, ఎం. ప్రవీణ్ కుమార్, సామాజిక కార్యకర్తలు అక్షయ్, శ్రీకాంత్, రాజ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.