హైదరాబాద్ (డిసెంబర్ – 03) : సూర్యుని ఉపరితల చర్యలు, సౌర గాలులు వంటి అంశాల మీద పరిశోధన కోసం భారత ఇస్రో సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 పని చేస్తూ (aditya L1 studies solar winds) ప్రయాణిస్తుంది.
తాజాగా ఆదిత్య L1 లోని ‘సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్’ అనే పరికరం తన పని ప్రారంభించింది ఈ పరికరం విజయవంతంగా సౌర గాలులను అధ్యయనం చేస్తుందని ఇస్రో ప్రకటించింది.
సూపర్ థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్, సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరాలు ఆదిత్య లో భాగంగా ఇప్పటికే ఆక్టివేట్ అయ్యాయి.
ఇవి పంపిన డేటా ఆధారంగా ఎనర్జీ హస్టోగామ్ తో ప్రోటాన్, ఆయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పార్టికల్స్ లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు ఈ తాజా విశ్లేషణతో సౌరగాలుల విలక్షణతపై ఇన్నాళ్ళు నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.
సౌరగాలుల్లోని అంతర్గత ప్రక్రియలు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతాయని విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1 పంపే డేటా సహాయపడుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 02న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ వన్ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ వన్ చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య ఎల్ వన్ సూర్యుడిని అధ్యయనం చేయనుంది.