INTERNATIONAL VOLUNTEERS DAY

BIKKI NEWS (DECEMBER – 05) : అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (వాలంటీర్స్ దినోత్సవం – INTERNATIONAL VOLUNTEERS DAY ) ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలకు మద్దతుగా వాలంటీరిజాన్ని మెరుగుపరచడంతోపాటు, కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించుకునేందుకు ఈ దినోత్సవం జరుపబడుతుంది

వాలంటీర్స్ డే 2023 థీమ్ :

ఈ సంవత్సరం యొక్క థీమ్ ప్రతి ఒక్కరి శక్తి – సమిష్టి చర్య – అందరూ చేస్తే

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1985, డిసెంబర్ 17 తేదీన చేసిన 40/212 తీర్మానంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 5వ తేదీన స్వచ్ఛంద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా, రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, వంటి అనేక ఎన్‌జిఒ సంస్థలు ఈ స్వచ్ఛంద సేవకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

దాదాపు 130 దేశాల్లో 86 ఫీల్డ్‌ యూనిట్లతో ఐక్యరాజ్య సమితి వాలంటీర్ల సంఘం ఏర్పాటయింది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 7700 మంది వాలంటీర్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి సేవలను అందిస్తారు. అంతేకాకుండా 2000వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి ఆన్‌లైన్ వాలంటీర్ల విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో సేవలందించే వాలంటీర్లు పనిచేస్తారు