విశాఖపట్నం (నవంబర్ – 29) : మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నావల్ డాక్ యార్డ్, అప్రెంటిస్ స్కూల్.. వివిధ ట్రేడుల్లో 275 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు (visakhapatnam naval dak yard apprentice jobs) కోరుతోంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 01 – 2024 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ట్రేడులు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ఆర్ అండ్ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.
అర్హతలు : పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050;
శిక్షణ వ్యవధి : ఒక సంవత్సరం
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు గడువు : జనవరి – 01 – 2024.