Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు నవంబర్ 25

చరిత్రలో ఈరోజు నవంబర్ 25

BIKKI NEWS : today in history november 25thచరిత్రలో ఈరోజు నవంబర్ 25

Today in history november 25th

దినోత్సవం

  • అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము.
  • ఎన్.సి.సి. దినోత్సవం.
  • జాతీయ జంతు సంక్షేమ దినం.

సంఘటనలు

1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.
2010: ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

జననాలు

1926: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)
1951: సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.
1952: ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
1954: సౌభాగ్య, కవితాసంపుటి ‘సంధ్యాబీభత్సం’ ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది
1966: రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి.
1968: ముప్పలనేని శివ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
1969: సుకన్య , దక్షిణ భారత చలన చిత్ర నటి.

మరణాలు

1964: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు. (జ.1893)
1974: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)
1984: యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1988: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922)
2003: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (జ.1928)
2010: మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942)
2015: ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మరణించాడు (జ. 1926).

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు