BIKKI NEWS (జూలై – 07) : అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని (world chocolate day on July 7th) ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోవత్సం జరుపుకుంటారు.
1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపబడింది.
చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.