BIKKI NEWS (DEC. 19) : కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలు (6 GUARENTEE SCHEMES OF CONGRESS IN TELANGANA) గురించి పూర్తి వివరాలను ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇవి పేరుకు 6 గ్యారెంటీ లు కానీ వీటిలో 13 పథకాలు మిళితమై ఉన్నాయి…
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంచడం వంటి రెండు పథకాలు డిసెంబర్ 9 నుండి అమలు చేయడం జరిగింది. మరికొన్ని పథకాలు డిసెంబర్ 28 నుండి అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
1) మహాలక్ష్మి
- మహిళలకు నెలకు 2,500/- చొప్పున చెల్లింపు
- మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం (డిసెంబర్ – 09 – 2023న ప్రారంభం)
- గ్యాస్ సిలిండర్ ధర 500/-
2) రైతు భరోసా
- సంవత్సరానికి రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000/- ఆర్థిక సహాయం.
- రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం
- వరి ధాన్యం కు 500/- రూపాయల బోనస్
3) యువ వికాసం
- నిరుద్యోగులకు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు అందజేత
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు
4) ఇందిరమ్మ ఇళ్ళు
- ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల సహాయం, ఇళ్ల స్థలం లేని వారికి స్థలం కేటాయింపు.
- తెలంగాణ ఉద్యమకారులందరికి 250 గజాల స్థలం కేటాయింపు.
5) గృహజ్యోతి
- ప్రతి ఇంటికి 200 యూనిట్ ల ఉచిత విద్యుత్
6) చేయూత
- వృద్దులకు నెలకు 4,000/- రూపాయల పెన్షన్
- రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంపు (డిసెంబర్ – 09 – 2023 నుంచి)