BIKKI NEWS (SEP. 26) : 35000 jobs notifications soon in telangana. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని, రెండుమూడు రోజుల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
35000 jobs notifications soon in telangana
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం బ్యాకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) కోర్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పరిశ్రమ అవసరాలను తీర్చడం, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును ప్రారంభించినట్టు తెలిపారు.
స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ క్యాంపస్‌లను రాష్ట్రంలో ప్రారంభించాలని ఆయా సంస్థలను కోరినట్టు చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్ పట్టాలు అందుకుంటున్న లక్షలాది విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీచింగ్ స్టాఫ్‌లో సరైన నైపుణ్యాలు లేవని, ఇలా ప్రమాణాలు లేని కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.