Home > EMPLOYEES NEWS > నూతన అధ్యాపకుల సర్వీస్ విషయంలో రక్షణ కల్పించండి

నూతన అధ్యాపకుల సర్వీస్ విషయంలో రక్షణ కల్పించండి

  • తెలంగాణ ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు శ్రీ నవీన్ విట్టల్ ఐఏఎస్ గారికి వినతి పత్రం

BIKKI NEWS (May 14) : 2023 batch lecturers meet naveen mittal today. 2023 మే నెలలో క్రమబద్ధీకరించబడ్డ నూతన అధ్యాపకుల (2023 బ్యాచ్ జేఎల్స్, డీఎల్స్, పీఎల్స్) సర్వీస్ కు సంబంధించిన విషయాలలో రక్షణ కల్పించవలసిందిగా మరియు నూతన అధ్యాపకులకు బదిలీల సౌకర్యం కల్పించాలని మరియు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో క్రమబద్ధీకరణ కాని కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం అందించవలసిందిగా… ఈరోజు నూతన అధ్యాపకుల తరఫున ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు శ్రీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారికి తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

2023 batch lecturers meet naveen mittal today.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరు శ్రీనివాస రావు గారు, కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారు, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్- 475 రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, నాయిని శ్రీనివాస్, హరగోపాల్, పాతూరి రాజు రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ఆల్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జీ. ఉదయ భాస్కర్, నవీన్ కుమార్, జి. రామకృష్ణ, ఎం. మమత తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు