BIKKI NEWS : ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడింది.
World Music Day
సరస్వతి దేవి, నారదుడు, కృష్ణుడి చేతులలో సంగీత పరికరాలు ఉండటం మనం గమనించవచ్చు. ఇది దేవతలు సంగీతాన్ని ఆశ్వాదించారనడానికి సూచిక.. సామవేదాన్ని సంగీత నిలయంగా భావిస్తారు.
సంగీతానికి భాష లేదు… ఆశ్వాదించడానికి విద్య అవసరం లేదు… మానవుల నుండి పశుపక్ష్యాదుల వరకు అంతెందుకు రాళ్ళు కూడా సంగీతానికి కరిగిపోతాయి అని నానుడి…
సంగీతం ఒక వైద్యం. ఇప్పటికి ప్రపంచంలో పలు ప్రాంతాలలో సంగీతాన్ని వైద్యానికి ఉపయోగిస్తారు. సంగీతం అనేక మానసిక రుగ్మతలను, టెన్షన్ లను తగ్గించి మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది.
సంగీతానికి స్వరాలు ఏడు… సప్త స్వరాలు కాని అనేక రూపాలలో మనల్ని అలరిస్తుంది. భారతీయ, శాస్ర్తీయ, ఆధునిక, జానపద, ఆరేబియన్ వంటి అనేక రూపాలలో నేడు సకల ప్రాణులను అలరిస్తుంది.
General Knowledge bits and More link