Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > W.H.O. REPORT ON DRINKING WATER 2023

W.H.O. REPORT ON DRINKING WATER 2023

BIKKI NEWS (జూన్ – 30) : WORLD HEALTH ORGANIZATION తాజాగా విడుదల చేసిన WASH REPORT 2023 (WAter, Sanitation, Hand Wash) ప్రకారం ప్రపంచంలో 56 శాతం జనాభాకు మాత్రమే ఇంటి వద్ద సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో 9 శాతం, యూరప్ లో 62 శాతం మాత్రమే సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంది. ఇది దక్షిణాసియా దేశాల్లో 27 శాతమే ఉంది.

భారత్ లో జల్ జీవన్ మిషన్ సత్పలితాలు ఇస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. భారతదేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికీ తాగునీటి వసతి ఉందని తెలిపింది. భారత్ లో తెలంగాణ రాష్ట్రం అన్ని గృహలకు (53.98 లక్షల ఇళ్ళు) 98.7% స్వచ్ఛమైన త్రాగు నీటిని మిషన్ భగీరథ ద్వారా అందజేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

తెలంగాణతో పాటు ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందిస్తున్న రాష్ట్రాలలో గోవా, హరియాణ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి.

శుద్ధజలం, పరిశుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 లక్షల ప్రాణాలను, 7.4 కోట్ల మందిని వివిధ రకాల వైకల్యాల నుంచి కాపాడుకోవచ్చు అని WHO నివేదిక పేర్కొంది.

భారత దేశంలో డయేరియా మరణాలు 6 లక్షలు.. దేశంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, మలేరియా, డెంగీ, శ్వాసకోశ సంబంధిత రోగాల వల్ల ప్రతీ ఏడాది లక్షకు 40-70 మంది వరకు మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ నివేదిక వివరించింది. ఈ మరణాల్లో ఐదేళ్లలోపువారే 60 శాతం ఉంటారని పేర్కొంది.

2019 లెక్కల ప్రకారం డయేరియాతో దేశవ్యాప్తంగా 6.07 లక్షల మంది చనిపోతున్నారు. అందులో తాగునీరు సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు 2,03,863 ఉన్నాయి. ఇందులో మహిళలే 1,23,964 మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 20,045 మంది ఉన్నారు.

ఇక పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియాతో 2,44,287 మంది చనిపోతున్నారు. అందులో మహిళలు 1.48 లక్షల మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 24,020 మంది ఉన్నారు.

ఇక చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు ఏడాదికి 1,59,015 ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వివరించింది. అందులో 96,694 మంది మహిళలుండగా, ఐదేళ్లలోపు
వారు 15,635 మంది ఉన్నారు.

ఇదిలా వుంటే 51,740 మంది చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారని నివేదిక పేర్కొంది.

వాగులు వంకల్లో నీటిని తాగే వారితో పోలిస్తే శుద్ధి చేసిన ఇంటి వద్దే అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల డయేరియా కేసుల సంఖ్య 52 శాతం తగ్గుతుంది.

పరిశుభ్రమైన నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడం, చేతి శుభ్రత పాటించకపోతే సాంక్రమిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే జబ్బులు వస్తాయి.

డయేరియా కారణంగా పిల్లలు బడికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల పని తీరులోనూ మార్పులు వస్తాయి. ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి పెరుగుతుంది.

చేతి శుభ్రత లేకపోతే కరోనా వంటి వైరస్లు వస్తాయి. తాగునీరు సరిగా లేకపోవడం వల్ల రక్తహీనత కూడా సంభవిస్తుంది.