WOMEN’S RESERVATION BILL : లోక్‌సభలో అమోదం

న్యూడిల్లీ (సెప్టెంబర్ 20) : Women’s Reservation Bill passed in LokSabha – లోక్‌సభ మహిళ రిజర్వేషన్ బిల్లు 2023 కు – రాజ్యంగ (128 సవరణ) బిల్లు అమోదం తెలిపింది. సభలో ఉన్న మొత్తం 456 సభ్యుల్లో 454 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఎంఐఎంకు చెందిన ఇద్దరు సభ్యులు మహిళా బిల్లును వ్యతిరేకించారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో పాస్‌ అయిన తొలి బిల్లుగా ఇది చరిత్రకెక్కింది. Women’s Reservation Bill passed in LokSabha –

చట్టసభల్లో (లోక్‌సభ & శాసనసభ లు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లుకు లోక్‌సభ అమోదం తెలిపింది. అయితే డీలిమిటేషన్‌ తర్వాతే మహిళలకు రిజర్వేషన్‌ కోటా అమలుకానున్నది.

రాజ్యసభ ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ బిల్లు చట్ట రూపం దాల్చనుంది.