Home > EDUCATION > UNIVERSITIES NEWS > శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ

శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ

BIKKI NEWS (FEB. 04) : VIKASITHA BHARATH 2047 SEMINAR IN SATAVAHANA UNIVERSITY. శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్@2047: ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్. వి. బాలకిష్ణారెడ్డి శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ సంయుక్తంగా సదస్సు పుస్తకం ఆవిష్కరించారు.

VIKASITHA BHARATH 2047 SEMINAR IN SATAVAHANA UNIVERSITY

అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్రాల మధ్య సమగ్ర సహకారము మరియు సుస్థిరమైన అభివృద్ధే వికసిత్ భారత్ యొక్క లక్ష్యం అన్నారు.

శాతవాహన ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ… ఇప్పటివరకు భారత దేశము కొన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరొక విశిష్ట అతిథి మరియు కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్. ఆర్. సాయన్న మాట్లాడుతూ… ఇంకా భారతదేశం పరిమాణాత్మకంగా మరియు గుణాత్మకంగా అభివృద్ధి సాధించాలని తెలిపారు.

భారతదేశం పారిశ్రామిక మరియు సేవా రంగాలలో త్వరితగతిన వృద్ధి సాధించినప్పటికీ ఇంకా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కావాలని అప్పుడే గ్రామీణ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. ఎ. జానయ్య గణాంకాలతో విశ్లేషించారు.

కాకతీయ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగపు సీనియర్ ఆచార్యులు మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్.బి. సురేష్ లాల్ మాట్లాడుతూ… ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పడుతుందని ఇది 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయ రిజిస్టార్ ప్రొఫెసర్. రవికుమార్ జాస్త్రి మాట్లాడుతూ… భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఎంతో కాలం పట్టదని త్వరలోనే ఇది ఒక వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకుంటుందని వివరించారు.

భారతదేశం ఇంకా సామాజికంగా అభివృద్ధి సాధించాలని విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్. సూరేపల్లి సుజాత వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానంతో పోటీ పడుతుందని ఇంకా ఈ సంఖ్య వృద్ధి చెందాలని అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఇదే వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యం అని సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కోడూరు శ్రీవాణి వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ యం. వరప్రసాద్, యుజిసి అఫైర్స్ మరియు ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్. కే .పద్మావతి, వి.సి ఓ. ఎస్. డి డాక్టర్.డి. హరికాంత్ మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు మరియు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు వికసిత్ భారత్ పై వివిధ కోణాల్లో వ్యాసాలను సమర్పించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు