UPSC CIVIL SERVICES 2024 – సివిల్స్ పూర్తి నోటిఫికేషన్, సిలబస్

BIKKI NEWS (FEB. 14) : UPSC CIVIL SERVICES EXAMINATION 2024 NOTIFICATION – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్ ఇండియా సర్వీసులో 1,056 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS) లలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి ఆగస్టు 01 – 2024 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కలదు.

ఫిబ్రవరి 14 నుండి మార్చి 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 26వ తేదీన మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుండి ప్రారంభం కానున్నాయి.

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. ఓ బి సి మరియు పీడబ్ల్యుడీ లకు 9 సార్లు వరకు అవకాశం కలదు.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

UPSC WEBSITE : https://upsc.gov.in/