BIKKI NEWS (JULY 24) : UNO AIDS REPORT 2023 FACTS. ఎయిడ్స్ వ్యాధిపై ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలు సంచలన విషయాలు వెలుగు చూశాయి ఈ నివేదిక 2023వ సంవత్సరానికి సంబంధించినది. ఈ నివేదిక ప్రకారం ఎయిడ్స్ బారిన పడిన వారు నిమిషానికి ఒకరు చొప్పున ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నట్లు సంచలన నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.
UNO AIDS REPORT 2023 FACTS
1) 2023 చివరి నాటికి దాదాపు నాలుగు కోట్ల మంది హెచ్ఐవి తో జీవించి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది
2) ఎయిడ్స్ బారిన పడి కూడా 90 లక్షల మంది ఎలాంటి వైద్య సహాయం తీసుకోకుండానే జీవిస్తున్నట్లు పేర్కొంది.
3) ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2004లో 21 లక్షల మంది మృతి చెందారు ్
4) 2023 నాటికి ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 6.3 లక్షల మంది మృతి చెందారు.
5) పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా, తూర్పు ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ వ్యాధి భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
6) ఆఫ్రికాలోని పలు ప్రాంతాలలో యువకులు, కౌమార దశలో ఉన్న వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.
7) ఈ వ్యాధి భారీన పడే వారిలో సెక్స్ వర్కర్లు, గే లు మరియు మాదకద్రవ్యాలు తీసుకునే వారే 55% గా ఉన్నారు.
8) 2023 లో కొత్తగా నమోదైన హెచ్ఐవీ కేసుల సంఖ్య 13 లక్షలు కావడం గమనర్హం.