BIKKI NEWS (MARCH 10) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్-2 మరియు గ్రూప్ – 3 నోటిఫికేషన్ లలో పోస్టుల సంఖ్యను పెంచే ప్రతిపాదనపై మార్చి 12న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం (tspsc group 2 and group 3 posts increasing decision on cabinate meet) తీసుకుంటారని సమాచారం.
ఇప్పటికే ఈ నోటిఫికేషన్ లకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అలాగే పరీక్షల షెడ్యూల్ ను కూడా తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
అయితే తాజాగా ఆర్థిక శాఖ గ్రూపు – 2 మరియు గ్రూప్ – 3 ఖాళీ పోస్టుల వివరాలను అందించాలని శాఖల వారీగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని శాఖలు ఆర్థిక శాఖకు అందించాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 మరియు గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే గ్రూప్ – 1 మరియు టీచర్ పోస్టులను పెంచి నూతన నోటిఫికేషన్ లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ – 2 మరియు గ్రూప్ – 3 నోటిఫికేషన్ లలో అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఉంది.