BIKKI NEWS (MARCH 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2024 మే సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా పడే అవకాశం (TSPSC DEPARTMENTAL TESTS 2024 MAY POSTPONE DUE TO ELECTIONS) ఉంది. డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 13వ తేదీ నుండి ప్రారంభం కానుండగా అదే రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
2024 మే సెషన్ కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 13 నుండి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా మే 13 తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. కావున ఉద్యోగస్తులందరూ పోలింగ్ విధులలో ఉండటంతో డిపార్ట్మెంటల్ టెస్ట్ లు కచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. దీనిమీద టీఎస్‌పీఎస్‌సీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.