TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 26 – 08 – 2024

BIKKI NEWS (AUG 26) : TODAY NEWS IN TELUGU on 26th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 26th AUGUST 2024

TELANGANA NEWS

తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో 65 సంఘాలు.. డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డిని చైర్మన్‌గా ఏకగ్రీవం గా ఎన్నుకున్నాయి.

నీటికుంటలో నిర్మించిన జీహెచ్‌ఎంసీని కూల్చేస్తారా..? హైడ్రా కూల్చివేతలపై సర్కారుపై మండిపడ్డ అసదుద్దీన్‌ ఒవైసీ

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

18 చోట్ల కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. 43.94 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్‌ ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది శ్రమదోపిడీకి గురవుతున్నారు. కాంట్రాక్టర్లు, మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలు.. నిబంధనల మేరకు పూర్తి వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఏకంగా రూ.175 కోట్ల భారీ సైబర్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షంషీర్‌గంజ్‌ ఎస్బీఐలో అనుమానాస్పద ఖాతాల ద్వారా భారీ సైబర్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్‌ వెల్లడించారు.

టీటీడీపీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతోపాటు నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు

రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ.45 కోట్లు బదిలీ చేశారని, అవి ఎవరి ఖాతాలని ఎక్స్‌లో ఆయన ప్రశ్నించారు.

2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్‌ గేమ్స్‌ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు.

డెంగ్యూపై సమీక్ష చేయకుండా.. విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం: హరీశ్‌రావు

నిండు కుండలా నాగార్జునసాగర్‌.. గేట్ల పైనుంచి దూకుతున్న కృష్ణమ్మ.

వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయ్‌.. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యాఖ్యలపై నాగార్జున స్పందన..

ANDHRA PRADESH NEWS

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఎఎస్‌ శర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలకు కారణమవుతున్న యజమానులను జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం.

రాగల 24 గంటల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో తేలకిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం సాయంత్రం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో డాక్టర్‌ పేరంశెట్టి రమేశ్‌బాబు (64) మరణించారు. చనిపోయిన డాక్టర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

NATIONAL NEWS

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ వైద్యురాలి హత్యాచార కేసు నిందితుడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష ముగింది

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్‌లో యూ అంటే మోదీ సర్కార్‌ యూటర్న్‌లని ఖర్గే అభివర్ణించారు.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు రావాలని ఆ దేశం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. ఈ ఏడాది ఇస్లామాబాద్‌లో సమావేశం జరుగనున్నది. ఈ భేటీకి షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యదేశాల అధినేతలు భేటీకి హాజరుకానున్నారు.

ఫిరోజ్‌పూర్‌ నుంచి ధన్‌బాద్‌ వెళ్తున్న కిసాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సియోహరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయ్‌పూర్‌ రైల్వేగేట్‌ సమీపంలో రెండుభాగాలుగా విడిపోయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్‌గా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి అయిన ఆయన ఐదేళ్ల పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు

కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవికుమార్‌ గౌడ బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’తో ప్రయత్నాలు చేస్తున్నదని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రూ.100 కోట్లు ఆఫర్‌ చేస్తున్నదని అన్నారు.

గగన్ యాన్ ద్వారా 20 ఈగలను అంతరిక్షంలోకే పంపనున్న ఇస్రో డ్రొసోఫిలియా మెలనోగాస్కర్ ఈగలను పంపనున్నారు.

INTERNATIONAL NEWS

100 విమానాలతో లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.

జర్మనీలోని సోలింజెన్‌ నగరంలో ఓ దుండగుడు కత్తితో దాడిచేసి ముగ్గురిని హతమార్చాడు. ఈ ఘటన వెనుక ఐసిస్‌ హస్తం ఉన్నట్లు తేలింది. హత్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.

హమాస్, హెజ్బొల్లా అగ్ర నేతల హత్యల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం తెల్లవారుజామున లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడింది.

BUSINESS NEWS

ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ అనుబంధ సిట్రోన్ ఇండియా తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు 2024-సిట్రోన్ సీ3 ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా.. దేశీయ మార్కెట్లో తన క్యూ8 ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది

బోర్డుల్లో నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను నియమించనందుకు కేంద్ర చమురు సంస్థలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు జరిమాన చెల్లించాయి.

భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తిరిగి పెరిగాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.

SPORTS NEWS

బంగ్లాదేశ్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. న‌జ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్‌ పై టెస్టుల్లో తొలి విజ‌యం న‌మోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావ‌ల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 707 వికెట్లతో వెటీరీని ష‌కీబ్‌ అధిగ‌మించాడు. కివీస్ వెట‌ర‌న్ ఖాతాలో 705 వికెట్లు ఉన్నాయి. ష‌కీబ్ ఇప్ప‌టివ‌ర‌కూ టెస్టుల్లో 241, వ‌న్డేల్లో 317, టీ20ల్లో 149 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

భార‌త స‌ర్ఫ‌ర్లు సంచ‌ల‌నం సృష్టించారు. తొలిసారి ఆసియా క్రీడ‌ల బెర్తు కైవ‌సం చేసుకున్నారు

‘గ‌దులు పంచుకోవ‌డంతో పాటు మైదానంలో జీవిత‌కాల జ్ఞాప‌కాల‌ను పంచుకున్నాం. అవ‌త‌లి ఎండ్‌లో ఉండి నువ్వు నా ప‌నిని ప్ర‌తిసారి తేలిక చేసేవాడివి. నువ్వొక అల్టిమేట్ జాట్’ అని శిఖర్ దావన్ గురించి రోహిత్ శర్మ తెలిపారు.

ఆసియా సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తన్వి పత్రి చాంపియన్‌గా నిలిచింది.

EDUCATION & JOBS UPDATES

నీట్‌ పీజీ-2024 ఫలితాలు ఆశావహులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా మంది అభ్యర్థుల ఫలితాల్లో గణనీయమైన తేడాలు కనిపించడమే ఈ ఆందోళనకు కారణం.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు