Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 10 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 10 – 2024

BIKKI NEWS (OCT. 20) : TODAY NEWS IN TELUGU on 20th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 20th OCTOBER 2024

TELANGANA NEWS

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్‌-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో-29 ప్రకారమే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఆ మేరకే మె యిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29 వ‌ల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతున్న‌దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు ధ్వ‌జ‌మెత్తారు

రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో-29 జారీ చేసిందని విమర్శించారు.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.

నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. రాష్ట్రానికి నాలుగు రోజులు వర్ష సూచన

ANDHRA PRADESH NEWS

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం : బొత్స సత్యనారాయణ

స్థానిక అవసరాల కోసం వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తవ్వుకుని ఎడ్లబండి, ట్రాక్టర్లలో రవాణా చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి రాజధాని నిర్మాణ పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధుకు ఆన్‌ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది.

NATIONAL NEWS

శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.

జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌ రహత్కర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం శనివారం నోటిషికేషన్‌ జారీ చేసింది.

జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆమోదం తెలిపారని శనివారం అధికారులు తెలిపారు.

సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 25 వేల పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో రిటైర్డ్‌ ఉద్యోగులకు సైతం అవకాశం కల్పించింది. 65 ఏండ్లలోపు వయసున్న రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగులు సూపర్‌వైజర్ల నుంచి ట్రాక్‌మెన్‌ వరకు వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

సుప్రీంకోర్టు ప్రజాకోర్టుగా ఉండాలని, దానిని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ అన్నారు

ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్‌ఐ)ను ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జేఏవైలో కలపాలని ఈఎస్‌ఐసీ వైద్య ప్రయోజన మండలి నిర్ణయించింది.

INTERNATIONAL NEWS

ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్య‌హూ ఇంటిపై డ్రోన్ దాడి జ‌రిగింది. సిసేరియా ప‌ట్ట‌ణంలో ఉన్న ఆయ‌న నివాసంపై డ్రోన్‌తో అటాక్ చేశారు. నెతాన్య‌హూ ఇంటిపై జ‌రిగిన దాడిలో ఎవ‌రికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

క్యూబాలో విద్యుత్తు ప్లాంట్ విఫ‌లం కావ‌డంతో.. దేశ‌వ్యాప్తంగా చిమ్మ‌చీక‌ట్లు క‌మ్ముకున్నాయి.

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి.. 33 మంది దుర్మరణం

పన్నూ హత్యకు ‘రా’ అధికారి కుట్ర.. అమెరికా ఆరోపణను ఖండించిన భారత్‌

క్యాన్సర్‌ వ్యాధి చికిత్స దిశగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.

BUSINESS NEWS

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం వసూళ్లపై జీఎస్టీని ఎత్తివేయాలని వస్తున్న డిమాండ్‌పై జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించింది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌వో) ట్రేడింగ్‌లో వ్యక్తిగత నష్టాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది.

ఈ నెల 21వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్ ప్రారంభం అవుతుందని పేర్కొంది

SPORTS NEWS

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 29-44 తేడాతో తమిళ్‌ తలైవాస్‌ చేతిలో ఓటమిపాలైంది

ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.

బెంగళూరు టెస్టులో చివరి రోజు కివీస్ గెలుపునకు 107 పరుగులు, టీమిండియా గెలుపునకు 10 వికెట్లు అవసరం.

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ – 46/10
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ : 462/10

కివీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 402/10
కివీస్ సెకండ్ ఇన్నింగ్స్ : 0/0

ఏసీసీ ఎమర్జింగ్‌ ఆసియాకప్‌లో యువ భారత్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది.

EDUCATION & JOBS UPDATES

ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలి – సీఎం రేవంత్ రెడ్డి

అగ్రి ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాల గడువు పెంపు.

ఏపీలో 6 వేలకు పైగా ఉన్న పోలీసు కానిస్టేబుల్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు