BIKKI NEWS (OCT. 15) : TODAY NEWS IN TELUGU on 15th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15th OCTOBER 2024
TELANGANA NEWS
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరుగనున్నది.
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ నెల 18న హాజరు కావాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్‌లైన్‌లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అరుణోద య నాగన్నకు ఈ నెల 19న ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ పోర్టల్‌ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ స్థానం నుంచి వంగ మహేందర్‌రెడ్డిని పీఆర్టీయూ బరిలోకి దించనున్నది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేదాక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సూర్యనారాయణ,కార్యదర్శి యాద రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
క్యాట్‌ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‌లు.. తెలంగాణలోనే కొనసాగించాలని రిక్వెస్ట్.
తెలంగాణలో రూ. 1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు
ANDHRA PRADESH NEWS
ఏపీ లో భారీ వర్షాలు… పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు.
ఈ నెల 16న తిరుమల, తిరుపతితో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది
ఫ్రీ అయితే రెండింతల ధర ఎందుకు పెరిగింది.. ఏపీలో ఉచిత ఇసుక విధానంపై వైఎస్ జగన్ సీరియస్..
ఏపీలో రోడ్ల అభివృద్ధి కి 400 కోట్లు – గడ్కరీ
NATIONAL NEWS
ఇస్రో అధినేత సోమనాథన్ కు ఐఏఫ్ వరల్డ్ స్పేష్ పురస్కారం అందజేత.
భారత్, చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్య పరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరో పక్క పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో చైనా భారీగా నిర్మాణాల్ని చేపట్టింది.
వక్ఫ్(సవరణ) బిల్లును సమీక్షిస్తున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం పలువురు విపక్ష ఎంపీలు బహిష్కరించారు.
భారత్, కెనాలో మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. కెనడాలోని హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఒక దానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది.
ఆరేండ్ల తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
INTERNATIONAL NEWS
అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్‌తోపాటు షికాగో యూనివర్సిటీలో పరిశోధన నిర్వహిస్తున్న జేమ్స్ ఏ రాబిన్సన్ లకు అర్థశాస్త్ర నోబెల్ అందుకోనున్నారు.
సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.
ట్రంప్‌పై మరోసారి హత్యా ప్రయత్నం.. ర్యాలీలో తుపాకీలతో వ్యక్తి హల్‌చల్
తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యం మోహరించి ఆ రోడ్లను పేల్చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదని దక్షిణ కొరియా సోమవారం ఆరోపించింది
BUSINESS NEWS
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,973 (592)
నిఫ్టీ : 25,128 (164)
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభంలో 5 శాతం క్షీణించింది.
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఫోన్ పే కేవలం 9 రూపాయలకే రూ.25వేల వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ప్రకటించింది.
SPORTS NEWS
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో భారత్ ఇంటిముఖం పట్టింది.
రంజీ సీజన్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. జమ్ముకశ్మీర్ ఆటగాడు శుభం ఖాజురియా ద్విశతకంతో చరిత్ర సృష్టించాడు.
కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చికాగో మారథాన్ 42.19 కిలోమీటర్ల పందెంలో బరిలోకి దిగిన ఆమె 2:09:56 గంటల్లో లక్ష్యాన్ని చేరుకుంది.
EDUCATION & JOBS UPDATES
TGPSC – గ్రూప్ 1 హల్ టికెట్లు విడుదల
నేడు DSC 2024 టీచర్స్ కు పోస్టింగ్స్
తెలంగాణ లో దివ్యాంగులకు ఉద్యోగ పోర్టల్ ప్రారంభం.
తెలంగాణ లో BDS రెండో విడత వెబ్ ఆప్షన్లు 14 నుంచి ప్రారంభమయ్యాయి.