చరిత్రలో ఈరోజు జూన్ – 16, Today in history june 16th
దినోత్సవం
- అంతర్జాతీయ జలపాత దినోత్సవం
సంఘటనలు
1977: ‘ఒరాకిల్ కార్పొరేషన్’ ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)
1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన ‘సైకో’ నవల ఈ సినిమాకి ఆధారం.
1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ఫోర్డ్ కార్లు’ తయారు చేసే ‘ఫోర్డ్ మోటారు కంపెనీ ని’ అమెరికాలో స్థాపించారు.
1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, ‘రోల్డ్ అముండ్ సెన్’ నార్వే లోని ‘ఓస్లో’ రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.
1897: ‘రిపబ్లిక్ ఆఫ్ హవాయి’ ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ ‘రిపబ్లిక్ ఒఫ్ హవాయి’ రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది.
1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం.
1890: ‘లారెల్ అండ్ హార్డీ’ గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని ‘లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.
1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.
1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, ‘మొరార్ యుద్ధం – బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.
1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని ‘స్ప్రింగ్ ఫీల్డ్’ లో, తన ‘హౌస్ డివైడెడ్’ ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
1815: నెపొలియోనిక్ యుధ్దాలు – నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం ‘బ్లూఛెర్స్ ‘ అనబడే ప్రష్యన్ సైన్యాన్ని ‘బేటిల్ ఆఫ్ లిగ్నీ’ లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
1815: నెపొలియోనిక్ యుద్ధాలు – ‘బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్’ ఫ్రెంచ్ మార్షల్ ‘మైకేల్ నీ’ ‘ఆంగ్లో-డచ్’ సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’ పుస్తకం, నేటి ‘ఆర్దిక శాస్త్రానికి’ పునాది వేసింది. (1790 జూలై 17 మరణం).
ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో ‘బ్లూమ్స్ డే’ జరువుకుంటారు.
ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో ‘యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.
1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.
జననాలు
1902: బార్బరా మెక్‌క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2002).
1903: ఆచంట జానకిరాం, తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994)
1905: మల్లాది రామకృష్ణశాస్త్రి , కవి, తెలుగు గీత రచయిత (మ.1965)
1915: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998)
1917: నముడూరు అప్పలనరసింహం, తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)
1940: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
1948: ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.
1949: విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.
1951: పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి.
1959: వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు.
1971: టూపాక్ షకూర్ , అమెరికన్ రాప్ కళాకారుడు (మ.1996)
1977: జాన్ మేయర్, అమెరికా వాద్యకారుడు.
1978: సుప్రియ యార్లగడ్డ, చలనచిత్ర నటి.(అక్కినేని మనవరాలు )
1981: రాహుల్ నంబియార్ , నేపథ్య గాయకుడు.
1986: అంజలి, తెలుగు చలన చిత్రనటి , మోడల్
1994: ఆర్య అంబేద్కర్, మరాఠీ సినీ నేపథ్యగాయని.
Today in history june 16th