BIKKI NEWS : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 24. Today in history december 24th
Today in history december 24th
దినోత్సవం
- జాతీయ వినియోగారుల హక్కుల దినోత్సవం
సంఘటనలు
1865: శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్ క్లాన్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
1914: మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా జర్మనీ-బ్రిటన్ల మధ్య పోరు జరుగుతోంది. డిసెంబర్ 24 రాత్రి జర్మన్ సైనికులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొవ్వొత్తులతో అలంకరించి పాటలు పాడటం ప్రారంభించారు. ఇంగ్లిష్ సైనికులు కూడా వారితో గొంతు కలిపారు. ఇరుపక్షాల సైనికులూ సిగార్లూ మద్యంసీసాలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిస్మస్ ట్రూస్‌గా పేరొందిన ఇలాంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మరెప్పుడూ జరగలేదు.
1968: నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
1986:పార్లమెంటు ఆమోదించిన ‘వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
1925: ప్రాట్ & విట్నీ మొట్టమొదటి విమాన ఇంజెను తయారుచేయటం పూర్తిచేసింది
1999: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.
1989: మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్మెంట్ పార్క్ ‘ఎస్సెల్ వరల్డ్’ ముంబయిలో ప్రారంభమైంది.
1999: కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్ చేశారు.
2000: భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్.
2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.
జననాలు
1907: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (మ.1989)
1924: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980)
1924: సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
1956: అనిల్ కపూర్, భారతీయ నటుడు, నిర్మాత.
మరణాలు
1987: ఎం.జి.రామచంద్రన్, సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1917)
1988: మోదుకూరి జాన్సన్, నటులు, నాటక కర్త. (జ.1936)
2005: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (జ.1925)
2022: తునీషా శర్మ, భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. (జ.2002)
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి