Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st MAY 2024

1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ దేశం నుండి లక్ష కిలోల బంగారాన్ని భారతదేశానికి తరలించింది.?
జ : ఇంగ్లాండ్

2) దేశ చరిత్రలో తొలిసారిగా 56 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఏ నగరంలో నమోదయింది.?
జ : నాగపూర్

3) మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు చేస్తోంది.?
జ : 6.8%

4) టైమ్స్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 100 ప్రభావశీల కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయ కంపెనీలు ఏవి.?
జ : రిలయన్స్, టాటా, సీరమ్

5) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎన్ని.?
జ : 44.42 బిలియన్ డాలర్లు

6) అమెరికా లో నిర్వహించిన స్పెల్లింగ్ బీ 2024 విజేతగా నిలిచిన భారత సంతతికి చెందిన బాలుడు ఎవరు.?
జ : బృహత్ సోమ

7) ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీ బాలికల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : రిషిత రెడ్డి

8) ముత్తూట్ సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : షారుక్ ఖాన్

9) ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2024లో నిరుద్యోగిత రేటు ఎంతగా ఉంది.?
జ : 4.9%

10) ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ఎంతమంది నిరుద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.?
జ : 402 మిలియన్లు

11) ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ గా ఏది నిలిచింది.?
జ : తాషిగాంగ్

12) ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 01

13) వరల్డ్ యాంటీ టొబాకో డే గా ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : మే 31

14) 15 నిమిషాలలోనే కృత్రిమ వజ్రాలను తయారు చేసే సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : సౌత్ కొరియా