TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th MARCH 2024
1) దేశంలోని తొలి ఆయుర్వేదిక్ కేఫ్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : డిల్లీ – మహర్షి ఆయుర్వేదిక్ హస్పిటల్
2) అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించి నిర్మించిన కట్టడం గా తెలంగాణలోని ఏ కట్టడం నిలిచింది. దీనికిగాను నిర్మాణ సంస్థ షాపూర్జి పల్లోంజి సంస్థకు నేషనల్ సేఫ్టీ అవార్డు 2023 దక్కింది.
జ : తెలంగాణ నూతన సచివాలయం
3) కేంద్ర గణంకాల ప్రకారం ఉద్యానవన పంటలు, అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మొదటి స్థానం
4) ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గజ్జల వెంకటలక్ష్మి
5) స్వయం సహాయక సంఘాల మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ
6) భారత రెజ్లింగ్ సమైక్య నూతన సారధిగా ఎవరిని నియమించారు.?
జ : సంజయ్ సింగ్
7) ఐఐటి కాన్పూర్ సౌరశక్తితో నడిచే 5 కీమీ ఎత్తు ఎగురుగల నిఘా డ్రోన్ ను అభివృద్ధి చేసింది. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : మరాల్
8) ఏ సాంకేతికతతో హెచ్ఐవి ని పూర్తిగా తొలగించే సౌలభ్యం ఉంటుందని శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.?
జ : CRIS – PR ( క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటర్ స్పేస్డ్ పాలిండ్రోమిక్ రీపిట్స్)
9) 13 లక్షల బ్లాక్ హోల్స్ తో కూడిన 3డి మ్యాప్ ను ఏ అంతరిక్ష సంస్థ రూపొందించింది.?
జ : యూరప్ అంతరిక్ష సంస్థ
10) దివ్యాంగులు నిలబడేందుకు ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ ను ఐఐటి మద్రాస్ రూపొందించింది. దీనికి ఏమని పేరు పెట్టారు.?
జ : నియో స్టాండ్
11) యునెస్కో లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమం గురించి చర్చ చేశారు.?
జ : మనబడి నాడు నేడు
12) రష్యాలో కొత్త రాయబారిగా భారత్ ఎవరిని నియమించింది.?
జ : వినయ్ కుమార్