TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd APRIL 2024
1) అమెరికాలోని ఏ రాష్ట్రంలో 14 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధించారు.?
జ : ఫ్లోరిడా
2) WHO నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు చిన్నారులలో ఎంతమందిపై సైబర్ వేధింపులు జరుగుతున్నాయి.?
జ : ఒక్కరిపై
3) 1200 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రపంచంలోనే అతి తేలికైన బ్యాగును కోపర్ని అనే సంస్థ ఏ పదార్థంతో తయారు చేసింది.?
జ : ఏరోజెల్ (99% గాలి & 1% గాజు)
4) పెండింగ్ బిల్లుల అమోదం విషయంలో ఇటీవల రాష్ట్రపతి పై కోర్టుకెక్కిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ
5) భారత్ లో టీబీ (క్షయ) కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న మొదటి రెండు రాష్ట్రాలు ఏవి.?
జ : ఉత్తర ప్రదేశ్ & బీహార్
6) నెల్లూరు జాతికి చెందిన ఏ రకం ఆపు బ్రెజిల్ లో 40 కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డు సృష్టించింది.?
జ : వయాటినా 19 ఎఫ్ఐవీ మారా ఇమోవీస్
7) మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రోజు వారీ కూలీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతకు పెంచారు.?
జ : 300/-
8) Flood Hub Tool ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : గూగుల్
9) యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారత్ లో ఎప్పటి వరకు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొంది.?
జ : 2050
10) నోటి క్యాన్సర్ ను గుర్తించే లాలిపాప్స్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్
11) ఐఐటి పంజాబ్ పరిశోధకులు టాంటాలమ్ లోహాన్ని ఏ నదిలో కనిపెట్టారు.?
జ : సట్లెజ్
12) మయన్మార్ దేశంలో భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అభయ్ ఠాకూర్
13) గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ప్రైజ్ 2024 ఎవరికి దక్కింది.?
జ : మిచెల్ తలగ్రాండ్
14) ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : రికెన్ యమయొటా