TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th MAY 2024
1) ఇటీవల తెలంగాణ అధికారిక చిహ్నం వార్తల్లో నిలిచింది. ఇందులో ఉన్న చార్మినార్ ను ఏ సందర్భంలో నిర్మించారు.?
జ : నిజాం రాజ్యంలో ప్లేగు వ్యాధి నిర్మూలించిన సందర్భంగా
2) ఇటీవల తెలంగాణ అధికారిక చిహ్నం వార్తల్లో నిలిచింది. ఇందులో ఉన్న కాకతీయ కళాతోరణం ను ఏ సందర్భంలో నిర్మించారు.?
జ : ఢిల్లీ ఖిల్జీ సేనలపై 1303లో కాకతీయ రాజుల విజయం సందర్భంగా
3) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధిరేటును సాధిస్తుందని ఆర్బిఐ తాజాగా ప్రకటించింది.?
జ : 7 శాతం
4) డిజిటల్ ఫ్రాడ్స్ గత రెండేళ్లలో ఎంత శాతం పెరిగాయని ఆర్బిఐ ప్రకటించింది.?
జ : 708%
5) తెలంగాణ రాష్ట్రంలోని ఏ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ ప్రీ రిజర్వుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
6) భారత్ నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువులలో మొబైల్ ఫోన్లు ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 4వ స్థానం
7) NAFED చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జెతా అహిర్ షెహ్రా
8) ఇటీవల రుద్రం – 2 క్షిపణిని విజయవంతంగా భారత సైన్యం ప్రయోగించింది.ఇది ఏ లక్ష్యాలను ఛేదిస్తుంది.?
జ : గగనతలం నుండి భూమి పై ఉన్న లక్ష్యాలను
9) IMD ప్రకారం ఢిల్లీలో తాజాగా ఎంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది .?
జ : 52.3 డిగ్రీల సెల్సియస్
10) గోల్డ్ మన్ సాచెట్స్ సంస్థ భారత వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 6.6 శాతం నుండి ఎంతకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.?
జ : 6.7%
11) ఒకే నెలలో ఎవరెస్టు శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పూర్ణిమ శ్రేష్ట (నేపాల్)
12) హిందీ జర్నలిజం దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 30
13) ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ను ఏ దేశంలో తయారు చేశారు.?
జ : భారత్
14) వన్ నేషన్ – వన్ స్పేస్ లక్ష్యం తో కోసం భారత్ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి.?
జ : మిషన్ ఇషాన్