TODAY CURRENT AFFAIRS IN TELUGU 11th MAY 2024
1) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు 2022లో భారత్ కు పంపిన సొమ్ము ఎంత.?
జ : 111.22 బిలియన్ డాలర్లు (అగ్రస్థానం)
2) 2029వ సంవత్సరం వరకు అంటార్కిటికా లో భారత ఏర్పాటు చేయనున్న నూతన కేంద్రం పేరు ఏమిటి.?
జ : మైత్రి – 2
3) గూగుల్ డీఫ్‌మైండ్ అణువులను పరిశోధించే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఆవిష్కరించింది. దాని పేరు ఏమిటి.?
జ : ఆల్ఫాఫోల్డ్ – 3
4) శుక్ర గ్రహం పొడిగా ఉండటానికి కారణమేమిటిని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.?
జ : హైడ్రోజన్ అంతరిక్షంలోకి వెళ్లిపోవడం
5) ఇటీవల బద్దలైన లా కుంబూర్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది.?
జ : ఈక్వెడార్
6) ఇటీవల మరణించిన టైటానిక్ సినిమా నటుడు ఎవరు.?
జ : బెర్నార్డ్ హిల్
7) నేషనల్ సూపర్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీమా పరోహ
8) జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా
9) ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం కింద ఎన్ని దేశాలను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించింది.?
జ : 23 దేశాలు
10) ఏ రాష్ట్రంలో ఆలయాలలో గన్నేరు పూల వాడకాన్ని నిషేధించింది.?
జ : కేరళ