Home > EMPLOYEES NEWS > CODE OF CONDUCT – ఎన్నికల కోడ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియామవళి

CODE OF CONDUCT – ఎన్నికల కోడ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియామవళి

BIKKI NEWS (MARCH 17) : ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ప్రవర్తన నియామవళి (The Election Code prescribes the conduct of government employees) ఉంటుంది. ఆ నియమాలు…

ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకీ, అభ్యర్థికీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు, ఆరోపణలకు ఆస్కారమివ్వకూడదు. ప్రభుత్వోద్యోగులు ప్రచారంలో పాల్గొనరాదు

ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందినా, అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం.

నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వోద్యోగులపై ఐపీసీ సెక్షన్ 171, 123తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134ఏ సెక్షన్ల కింద చట్టపరమైన, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

భార్య/భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ సెలవు లేదా పర్యటనలపై వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.

ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారుల బదిలీలపై నిషేధం ఉంటుంది.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతర రాజకీయ నాయకుల ఫొటోలేవీ ప్రభుత్వ భవనాల్లో ప్రదర్శించకూడదు.

మంత్రులు, రాజకీయ నాయకులెవరూ అధికారులతో వ్యక్తిగతంగా, సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించరాదు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసే లబ్ధిదారులు కార్డులు, శిలాఫలకాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, వారి సందేశాలు ఉండకూడదు.

ఎంపీ, ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లు, అంబులెన్స్లు తదితరాలపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల చిత్రాలను కనిపించకుండా మూసేయాలి.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక ఇచ్చే విద్యుత్తు, వాటర్ బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లు, పార్టీల చిహ్నాలు వంటివేమీ ఉండకూడదు.

అభివృద్ధి, నిర్మాణ ప్రాజెక్టులతో సంబంధమున్న ప్రభుత్వ విభాగాలు వాటి పరిధిలో ఇప్పటికే మొదలైన, మొదలు పెట్టాల్సిన పనుల జాబితాను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.