Home > EMPLOYEES NEWS > గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ

గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ

BIKKI NEWS (Mar. 26) : Guest junior lecturers will continue says minister Damodara. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ జూనియర్ లెక్చరర్ లను కొనసాగిస్తామని అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ గెస్ట్ లెక్చరర్స్ కి హామీ ఇచ్చినట్లు గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 2152 నాయకులు తెలిపారు.

Guest junior lecturers will continue says minister Damodara

కొత్తగా నియమించిన 1,286 జూనియర్ లెక్చరర్స్ తో పాటు ఇదివరకే పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ ను కొనసాగిస్తామని ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి స్పష్టం చేశారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 2152 స్టేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహేష్ మరియు వైస్ ప్రెసిడెంట్ చెరుకు దేవయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు