TGPSC – వివిధ నోటిఫికేషన్ ల ప్రస్తుత పరిస్థితి

BIKKI NEWS (JUNE 17) : TGPSC VARIOUS NOTIFICATIONS STATUS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని భక్తుల కొరకు సంక్షిప్తంగా అందించడం జరుగుతుంది.

TGPSC VARIOUS NOTIFICATIONS STATUS

Group 1 : ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2024 లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Group -2 : పోస్టులకు టీజీపీఎస్సీ ఆగస్టులో రాతపరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేసింది. దరఖాస్తుల్లో వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్‌ సదుపాయం కల్పించింది.

Group – 3 : నవంబర్ 17, 18 వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

Group – 4 : సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ప్రభుత్వ విభాగాల్లో 1,540 ఏఈఈ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది.

ఇప్పటికే వ్యవసాయ, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల ఎంపిక జాబితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే సివిల్‌ పోస్టుల ఫలితాలు రానున్నాయి.

833 సహాయ ఇంజినీర్‌ పోస్టుల ఫలితాల వెల్లడికి బోర్డు సమాయత్తమవుతోంది.

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూలై లో నిర్వహించనున్నారు.

581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టులకు పరీక్షలు ఈనెల 29తో ముగియనున్నాయి.

డివిజనల్‌ ఎకౌంట్స్‌ అధికారుల పోస్టుల కోసం రాతపరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

భూగర్భజలశాఖలో గెజిటెడ్‌ అధికారుల పోస్టుల ఫలితాలను ఇప్పటికే ప్రకటించింది.

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఆప్షన్లు తీసుకుంటోంది. ఈ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి జులై 2వరకు జరుగుతుంది.

పురపాలకశాఖలో ఎకౌంట్స్‌ అధికారుల పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి ఎంపిక జాబితాలను ప్రకటించింది.

ఇంటర్‌ విద్యా విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది నియామక ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది.

గురుకుల నియామక బోర్డు పరిధిలో సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన టీచర్లు, లెక్చరర్లు వచ్చేనెల మొదటివారం నుంచి విధుల్లో చేరనున్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు