MODEL SCHOOL ADMISSIONS – మోడల్ స్కూల్ ఆడ్మిషన్స్ టెస్ట్ 2024

BIKKI NEWS (FEB. 03) : తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2024 25 విద్యాసంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (TELANGANA MODEL SCHOOL ADMISSIONS TEST 2024) నోటిఫికేషన్ విడుదలయ్యింది.

అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్షకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

జనవరి 12 నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 01వ తేదీ నుండి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన 2 సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఆరవ తరగతి ప్రవేశాల కోసం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి ఖాళీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు – 200/-, BC, SC, ST, PHC & EWS విద్యార్థులకు 125/- రూపాయలుగా నిర్ణయించారు.

వెబ్సైట్ : TS MODEL SCHOOL