Employees JAC : ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా లచ్చిరెడ్డి

BIKKI NEWS (AUG. 26) : Telangana Employees JAC Chairman Lacchi Reddy. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 65 ఉద్యోగుల సంఘాలతో కూడిన తెలంగాణ జాయింట్ ఉద్యోగుల యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Telangana Employees JAC Chairman Lacchi Reddy

ఆదివారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సీపీఎస్, పెన్షన్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పలు సంఘాల నేతలు హాజరై ఐకాస ఏర్పాటుకు సంఘీభావం ప్రకటించారు.

అనంతరం నూతన చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, అన్యాయాలు, పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో జేఏసీగా ఏకతాటిపైకి వచ్చామన్నారు. వారసత్వంగా వస్తున్న ఉద్యోగ సంఘాల గుత్తాధిపత్యం ఉండొద్దనే ఆలోచనతో ఐకాస ఏర్పాటైందన్నారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. సంఘాలు నోరు మెదపకపోవడమే కాకుండా సర్కారుకు వత్తాసు పలికాయని దుయ్యబట్టారు.

గత పదేళ్ల నుంచి ప్రశ్నించని నేతలు నేడు ‘సైరన్’ పేరిట ఉనికి చాటుకుని ప్రభుత్వం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా వైద్యం, గృహ నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలు వేసి నిపుణుల అభిప్రాయాలు తీసుకుని విధానాలు రూపొందిస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్ధన్ రెడ్డి, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. నిర్మల, విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి రమేశ్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు