BIKKI NEWS (NOV. 22) : Stock markets in huge profits. అదానిపై పై అమెరికా అరెస్ట్ వారెంట్ తో నష్టాల బాటలో పయనిస్తాయి అనుకున్న స్టాక్ మార్కెట్లు బుల్లీస్ రన్ తో భారీ లాభాలతో ముగిశాయి. ఆదానీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతాయి అనుకుంటే లాభాల్లోనే ట్రేడ్ అవడం విశేషం.
Stock markets in huge profits
సెన్సెక్స్ 1,814పాయింట్లు లాభంతో 78,969 వద్ద ముగిసింది. గరిష్టంగా 79,218 పాయింట్లను తాకింది.
నిఫ్టీ పిప్టీ 524 పాయింట్ల లాభంతో 23,874 వద్ద ముగిసింది. గరిష్టంగా 23,956 పాయింట్లలను తాకింది.
లాభాలకు కారణాలు ఇవే.
బ్లూచిప్ షేర్లు ఇప్పటికే కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవ్వడంతో కొనుగోలు మద్దతు లభించింది.
అమెరికా మరియు ఆసియా స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభమవడంతో భారత మార్కెట్ లో కూడా అదే ట్రెండును కొనసాగించాయి.
అమెరికా నిరుద్యోగిత రేటు నివేదిక వెలువడిన నేపథ్యంలో నవంబర్ లో ఐటీ ఉద్యోగాలకు అవకాశాలు ఉండడంతో పాజిటివ్ ట్రెండ్ అయ్యాయి.