BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 21st NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 21st NOVEMBER 2024
1) బిల్లీ జీన్ కింగ్ కప్ – 2024 – ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నీ) విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : ఇటలీ
2) ఐపీఎల్ 2025 వేలం ఆక్షనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మల్లికా సాగర్
3) ఏ దేశం తమ సైన్యానికి ఎవరికి గౌరవ సేనాని హోదా కల్పించింది.?
జ : ఉపేంద్ర ద్వివేది (భారత సైన్యాధ్యక్షుడు)
4) నాటో కు అమెరికా రాయబారి గా ఎవరిని ట్రంప్ నియమించాడు.?
జ : జి. వైటకెర్
5) కెనడా కు అమెరికా రాయబారి గా ఎవరిని ట్రంప్ నియమించాడు.?
జ : పీట్ హోఎక్స్టా
6) ఏళభారత కుబేరుడు పై యూఎస్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ?
జ : గౌతమ్ అదాని
7) ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపై ఏ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.?
జ : ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)
8) 16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఏ దేశ పార్లమెంట్‌లో తాజాగా ప్రవేశపెట్టారు?
జ : ఆస్ట్రేలియా
9) అదాని తో విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టుతో పాటు జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసుకొంటున్నట్టు ఏ దేశాధ్యక్షుడు (విలియం రూటో) తెలిపారు.?
జ : కెన్యా
10) మాస్టర్ ఆఫ్ సర్రియలిజం అనే పెయింటింగ్ ప్రపంచ రికార్డు సాధించింది. న్యూయార్క్‌లోని ఆక్షన్ హౌస్ క్రిస్టీలో జరిగిన వేలంలో సుమారు రూ.1,022 కోట్లు పలికింది. దీనిని ఎవరు గీశారు.?
జ : రెనె మగ్రిట్టే
11) డాలర్ తో రూపాయి మారకం విలువ తొలిసారి ఎంతకు చేరింది.?
జ : 84.50 రూపాయలు
12) వచ్చే ఏడాది జరుగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌తో పాటు పారా గేమ్స్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది.?
జ :బీహార్
13) భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులాన్ గోస్వామి గౌరవార్ధం ఏ క్రికెట్ స్టేడియం లోని ఓ స్టాండ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు.?
జ : ఈడెన్ గార్డెన్స్