SLvsAFG : అఫ్ఘనిస్తాన్ సంచలన విజయం

పూణే (అక్టోబర్ – 30) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ (SLvsAFG) జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది.

శ్రీలంక విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. ఓమర్జాయ్ – 73*, రహ్మత్ షా – 62, అస్మతుల్లా – 58 పరుగులతో రాణించారు.

శ్రీలంక బ్యాట్స్‌మన్ లలో నిశాంక – 46, కుశాల్ మెండీస్ – 39 పరుగులతో రాణించారు. అప్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరూఖీ – 4, ముజీబు ఉర్ రేహ్మాన్ – 2 వికెట్లు తీశారు.