BIKKI NEWS (AUG. 15) : sbi increases interest rates. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచడంతో వినియోగ, ఆటో రుణాలు భారం కానున్నాయి. పెంచిన వడ్డీరేట్లు ఆగస్టు 15 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. గత జూన్ లో చివరిసారిగా ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ సవరించింది.
sbi increases interest rates.
తాజాగా ఎంసీఎల్ఆర్ సవరణతో వివిధ టెన్యూర్‌ల రుణాలపై వడ్డీరేటు 8.20 శాతం నుంచి 9.1 శాతానికి చేరుతుంది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 కాగా, నెల నుంచి మూడు నెలల గడువు గల రుణాలపై వడ్డీరేటు 8.45 నుంచి 8.5 శాతానికి చేరుకున్నది. ఆరు నెలల గడువు గల రుణాలపై 8.85 శాతం, ఏడాది టెన్యూర్ రుణంపై వడ్డీరేటు 8.95 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రెండేండ్ల గడువు గల రుణంపై వడ్డీరేటు 9.05 శాతం, మూడేండ్ల గడువు గల రుణంపై వడ్డీరేటు 9.1 శాతానికి పెరిగింది.
అయితే రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు వడ్డీ రేటు ఖరారు చేస్తాయి. ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచడంతో ఆటో, వినియోగ, గృహ రుణాలు భారం కానున్నాయి.