SAMUDRAYAAN – MATHSYA 6000 పూర్తి సమాచారం

BIKKI NEWS : ఆకాశం, అంగారకుడు, చంద్రుడు, సూర్యుడు అంతుచూసిన భారత్ ఇప్పుడు సముద్ర లోతుల అంతు చూడడానికి మానవ సహిత సముద్రయాన్ (samudrayaan mission) పేరుతో 6 కిలోమీటర్ల సముద్రపు లోతులను పరిశీలించడానికి మత్స్య 6000 (mathsya 6000) పేరుతో యంత్రాన్ని రూపొందించింది.

ఇప్పటివరకు సమద్ర గర్భంలో సబ్‌మెర్సిబుల్ ప్రయోగాలు చేపట్టింది… అమెరికా, రష్యా, చైనా, జపాన్, ప్రాన్స్ మాత్రమే… ఈ జాబితాలో భారతదేశం చేరనుంది.

ఈ ప్రయోగం 2024 లో 5 కీలోమీటర్ల లోతులో, 2026 లో 6 కిలో మీటర్ల లోతులో ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. మత్స్య యంత్రం ఫోటోలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు గురించి కూలంకషంగా పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…

samudrayaan mission

ప్రాజెక్టు రూప కల్పన : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియన్ టెక్నాలజీ
మిషన్ పేరు – సముద్రయాన్
సబ్ మెర్సిబుల్ – మత్స్య – 6,000
వ్యయం – 4,077 కోట్లు
ప్రయాణించే శాస్త్రవేత్తలు – ముగ్గురు
సబ్ మెర్సిబుల్ వ్యాసం – 2.1 మీటర్లు
80 మిల్లిమీటర్ల మందం గల టైటానియం మిశ్రమంతో దీన్ని తయారుచేశారు.
ఇది 600 బార్ ఒత్తిడిని తట్టుకుంటుంది. (సముద్ర ఉపరితలంపై ఉండే ఒత్తిడికి600 రెట్లు ఎక్కువ.)
సుమారు 12-16 గంటల పాటు నిర్విరామంగా సముద్ర గర్భంలో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది..
96 గంటల పాటు ఆక్సిజన్ ను అందించగలదు.
ఈ సబ్ మెర్సిబుల్ లో గోళం తప్పితే.. అన్ని వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలను రూపొందించారు. ఒక వ్యవస్థ విఫలమైనా ఇదిసురక్షితంగా బయటపడగలదు.

లక్ష్యం : సమద్ర గర్భంలో ఉన్న సహజ ఖనిజాలు,, సహజ ఇంధనాలు, భిన్న జీవుల వైవిధ్యం, వాతావరణం గురించి అధ్యయనం చేయడం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు