BIKKI NEWS (JUNE- 01) : JNVST 2026 -27admissions for 6th class. దేశ వ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాలలో 2026 – 27 విద్యా సంవత్సరం కోసం 6వ తరగతి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
jnvst 2026-27 admissions for 6th class
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 తెలంగాణ రాష్ట్రంలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు కలవు
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 29- 2025 వరకు కలదు.
గతంలో ఒకసారి పరీక్ష రాసిన అభ్యర్థులు రెండోసారి దరఖాస్తు కు అర్హులు కారు.
అర్హత : ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : లేదు
వయోపరిమితి : మే 1 – 2014 నుండి జూలై 31 -2016 మధ్య జన్మించిన వారు అర్హులు
దరఖాస్తు గడువు : జూలై 29- 2025 వరకు
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు. 2 గంటల సమయం ఉంటుంది. పరీక్ష ఓమ్మార్ పద్దతిలో, మల్టీపుల్ ఛాయిస్ లో ఉంటుంది.
- మెంటల్ ఎబిలిటి – 50 మార్కులు (40 ప్రశ్నలు)
- ఆర్థమెటిక్ టెస్ట్ – 25 మార్కులు (20 ప్రశ్నలు)
- లాంగ్వేజ్ టెస్ట్ – 25 మార్కులు (20 ప్రశ్నలు)
అడ్మిట్ కార్డులు : అడ్మిట్ కార్డుల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.
పరీక్ష తేదీ : 2026 ఎప్రిల్ 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం : మెంటల్ ఎబిలిటి – 40, అర్దిమెటిక్ – 20, లాంగ్వేజ్ – 20 మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
ఫలితాలు : మే /జూన్ లలో ఫలితాలు విడుదలవుతాయి.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://cbseitms.rcil.gov.in/nvs/
పూర్తి నోటిఫికేషన్ సిలబస్ : Download Pdf