BIKKI NEWS (MARCH 13) : సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీ లో 2024- 25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది . బి ఏ – ఇంగ్లీష్ (ఆనర్స్), బి ఏ – సోషల్ సైన్సెస్ (ఆనర్స్) కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ (SAMMAKKA SARAKKA UNIVERSITY ADMISSIONS) జారీ చేశారు. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష (CUET UG 2024) ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి గడువు మార్చి 26. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.