Home > SPORTS > YASASVI JAISWAL – ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్

YASASVI JAISWAL – ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్

BIKKI NEWS (MARCH 13) : ఐసీసీ 2024 ఫిబ్రవరి మాసానికి గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో భారత్ నుండి యశస్వి జైస్వాల్, మహిళల విభాగంలో ఆస్ట్రేలియా నుండి అన్నా బెల్ సదర్ ల్యాండ్ ఈ అవార్డులకు (ICC PLAYER OF THE MONTH AWARDS FOR YASASVI JAISWAL and ANNABEL) ఎంపిక అయ్యారు.

ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్ జట్టుపై వరుస టెస్ట్ మ్యాచ్ లలో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడమే కాకుండా, భారత్ తరపున టెస్టులలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అలాగే టెస్ట్ ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పినట్లు ఐసిసి ప్రకటించింది.

అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అనాబెల్ సదర్ ల్యాండ్ టెస్టులలో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది.