Home > 6 GUARANTEE SCHEMES > కొండలు, గుట్టలు, రోడ్లకు రైతంబంధు కట్ – భట్టి

కొండలు, గుట్టలు, రోడ్లకు రైతంబంధు కట్ – భట్టి

BIKKI NEWS (MARCH 09) : తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని (rythu bandhu cut for roads and non farming lands) నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నట్టు చెప్పారు.

గత ప్రభుత్వం రైతు బంధునుఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని తెలిపారు. అలాగే ఇప్పటికే 3 ఎకరాల లోపల రైతులకు రైతు బంధు నిధులు జమ చేసినట్లు తెలిపారు.

★ 12న వడ్డీ లేని రుణాల పథకం

“రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నాం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మార్చి 12న మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నాం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం.

గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చాం” అని తెలిపారు.